Homeహైదరాబాద్‌Hostels | విద్యార్థులను చలి నుంచి కాపాడండి

Hostels | విద్యార్థులను చలి నుంచి కాపాడండి

చలికాలం (Winter) మొదలైన నేపథ్యంలో అన్ని గవర్నమెంట్ (Government) హాస్టల్స్‌ (Hostels) విద్యార్థుల(Students)కు రగ్గులు(Rugs), గీజర్లు (Geysers) అందించాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ (BC JAC State Convener) లింగం గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)ను కలిసి విజ్ఞప్తి చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వసతిగృహాల్లో చదువుకునే విద్యార్థులకు తక్షణమే రగ్గులు పంపిణీ చేయాలని అన్నారు. స్నానానికి వేడి నీళ్ల కోసం గీజర్లను ఏర్పాటుచేయాలని అడిగారు. విద్యార్థులు చలికి వణికిపోతున్నారని, గదులకు తలుపులూ కిటికీలూ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల బెడ్లు లేక బండలపైనే దుప్పట్లు పరచుకొని పడుకుంటున్నారని తెలిపారు. వణికించే చలిలో విద్యార్థులు చల్లని నీళ్లతో స్నానం చేయటం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News