Homeఆదిలాబాద్Prajavani | ప్రజావాణి దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలి

Prajavani | ప్రజావాణి దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలి

  • జిల్లా అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్.

ప్రజావాణి దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.

- Advertisement -

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News