Tuesday, November 11, 2025
ePaper
Homeరంగారెడ్డిLaunch | పోస్టర్, బ్రోచర్ విష్కరణ..

Launch | పోస్టర్, బ్రోచర్ విష్కరణ..

జానపద ఉత్సవాల పోస్టర్(folk festival poster), బ్రోచర్(brochure), ఆవిష్కరణను నిర్వహించడం జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గం(malkajgiri constituency) ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలో(Ambedkar Bhavan) ప్రెస్ క్లబ్ పత్రికా విలేకరులతో ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు సందర్భంగా జానపద ఉత్సవాల పోస్టర్, బ్రోచర్, ను జ్వాలా శివ యూట్యూబర్, ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు లక్ష్మణ్, అడ్వకేట్ రవి, సారాధ్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే జానపద కళలకు ప్రత్యేకత ఉందని ఆ జానపద కళారూపాలను ప్రత్యామ్నాయంగా చూపిస్తూ జానపద ఉత్సవాలలో జరపడం గొప్ప శుభ కార్యక్రమం అని వారు అన్నారు.

ప్రజానాట్యమండలి(Praja Natya Mandali) అంటేనే కళ, కళ కోసం కాదు కళా ప్రజల కోసమని వెలుగెత్తి చాటిన గొప్ప అభ్యుదయ సంఘం ఎంతోమంది ప్రజలను చైతన్యవంతులు చేస్తూ కల కోసం కళాకాదు కళా ప్రజల కోసమని ఆనాటి కాలం నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు పోరాటాలకు తన కలాన్ని గలాన్ని నాటకాలు నృత్యరూపకాలని ప్రజల బాధలు కష్టసుఖాలను పీడిత ప్రజల విముక్తి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేటికీ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో రకాల కళారూపాలను ప్రదర్శిస్తున్న ప్రజానాట్యమండలి ఈ మహాసభల్లో మళ్లీ ఓ కొత్త నూతన కార్యక్రమాలను తీసుకుపోతుంది భవిష్యత్తులో అనేక రకాల కొత్త రూపాంతరం చెందబోతుందని తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొండూరి భాస్కర్ మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లెల రాము, టీవైఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News