జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని వినాయకనగర్, హరిజన బస్తీ, శివాజీ నగర్, సిద్ధి వినాయక నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మంగళవారం ఇంటింటి ప్రచారం (Door-to-door Campaign) నిర్వహించింది.

సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హెచ్(VH), జనగాం మాజీ ఎమ్మెల్యే, జనగాం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు(SuneethaRao), తెలంగాణ మత్స్యకార సంఘం చైర్మన్ మెట్టు సాయికుమార్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav), కార్వాన్ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ మాధవి, స్థానిక నాయకులు సత్యన్న, లడ్డు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో నేరుగా మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చుతోందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, రూ.500కే ఎల్ఫీజీ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని ప్రచారంలో పాల్గొన్న నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి మహిళ ఇందులో భాగస్వామి కావాలని, జూబ్లీహిల్స్ విజయాన్ని మహిళలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి ప్రతిబింబంగా నిలవాలని అన్నారు.

