Homeకరీంనగర్NH-563 Development | నాటి పోరాటం.. నేటి ప్రగతి

NH-563 Development | నాటి పోరాటం.. నేటి ప్రగతి

  • పొన్నం ప్రభాకర్ ముందుచూపుతోనే జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (NH-563)

తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఎంపీగా ఉన్న సమయంలోనే ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ప్రజల రవాణా సౌకర్యాల కోసం చేసిన కృషి నేడు ఫలితాలను ఇస్తోంది. వరంగల్- కరీంనగర్ – జగిత్యాల మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలన్న నాటి డిమాండ్, ముందుచూపు ఫలితంగానే NH-563(NH-563 Development) రూపుదిద్దుకుంది.

ఎంపీగా ఉన్నప్పుడే పోరాటం

- Advertisement -

పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు ఉన్న ప్రధాన రహదారి ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పలుమార్లు లేఖలు రాసి డిమాండ్ చేశారు.

2016లో కేంద్రం అధికారిక ధృవీకరణ

పొన్నం ప్రభాకర్ లేఖలకు స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2016 మే 24న అధికారికంగా లేఖ జారీ చేసింది. ఈ మార్గాన్ని మార్చి 2014లోనే NH-563గా ప్రకటించినట్లు, సుమారు 130 కిలోమీటర్ల మేర 4-లేన్ రహదారిగా అభివృద్ధి చేసేందుకు NHAIకి అప్పగించినట్లు నాటి కేంద్ర కార్యదర్శి సంజయ్ మిత్ర ఆ లేఖలో పేర్కొన్నారు.

వరంగల్ – కరీంనగర్ హైవే పూర్తి

నాడు పొన్నం ప్రభాకర్ చేసిన కృషి, పోరాటం ఫలితంగా చేపట్టిన NH-563లో వరంగల్- కరీంనగర్(Warangal-Karimnagar Highway) మధ్య హైవే నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించింది.

కరీంనగర్ – జగిత్యాల పనులపై ప్రత్యేక దృష్టి

మిగిలిన కరీంనగర్- జగిత్యాల మార్గంలో ఉన్న సాంకేతిక మరియు ఇతర అడ్డంకులను తొలగించి పనులను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

కరీంనగర్ – జగిత్యాల మధ్య హైవే పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

నాటి ఆలోచన.. నేటి అభివృద్ధి

ప్రజల భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి, ప్రాంతీయ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కోసం నాడు ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన కృషి నేడు కార్యరూపం దాల్చుతోంది. నాటి పోరాటం – నేటి ప్రగతికి NH-563 ఒక నిదర్శనం అని మంత్రి కార్యాలయం పేర్కొంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News