సార్లు ఏమన్నా తక్కువు తిన్నారా ఏంది? ఒకటో తారీకు రాగానే జీతం వస్తది.. గిదేంది బాయ్ మళ్ళీ టేబిల్ కింద చేయి పెట్టుడు..? ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే మామూలోళ్లకి, దోపిడీచేసే టోళ్ళకి దోస్త్ అయిపోవడమేనా? స్టేషన్ల ముందర బోర్డుల మీద ఏమేమో రాసి ఉంటది.. లోపట మాత్రం ‘రేట్లు’ వేరే నడుస్తయ్.. ! ఎవలైనా బాధితుడు గోడు చెప్పుకోనీకి వస్తే.. సూది మందు ఇచ్చినట్టే మత్తులో పడేస్తరు.. గదే లంచం ముట్టజెప్పితే మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్టు ఉరికివచ్చి సలాం కొడతరు! వట్టి చేతులతో వస్తే కేసుల ఫైళ్లు గాలికి పోతయ్.. కవరు సంచితో వస్తే దొంగ కూడా దొర అయిపోతడు.చట్టం తన పని తాను చేసుకుపోతుందో లేదో గానీ… మామూళ్ల వసూలు మాత్రం మీటర్ కొట్టిన ఆటో లెక్కన ఆగకుండా పరుగెడుతుంది!
- Advertisement -
