Homeనిజామాబాద్‌Negligence | అంతా మా ఇష్టం… ప్రజావాణికి పలు శాఖల అధికారులు డుమ్మా…!

Negligence | అంతా మా ఇష్టం… ప్రజావాణికి పలు శాఖల అధికారులు డుమ్మా…!

  • సమయపాలన పాటించని కొందరు అధికారులు…!
  • క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కరువు..!

ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులను ఓకే వేదిక పై తెస్తు ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రజావాణికి మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా సమయనుకూలంగా హాజరు కావాల్సి ఉంటుంది. కాని కొందరు అధికారులు డుమ్మాలు కొడితే, మరి కొందరు సమయపాలన పాటించకుండా ఆలస్యంగా రావడం పట్ల వాళ్ల అంకిత భావాన్ని తెలియజేస్తుంది. కొందరు అధికారులు అంత తమ ఇష్టమనే చందాన వ్యవహరిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి .

తాజాగా సోమవారం ఉదయం 10:32 గంటల సమయానికి కేవలం ఎనిమిది శాఖల అధికారులు మాత్రమే హాజరు కావడం,మరికొన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించకుండా లేటుగా రావడం వెనుక విధుల పట్ల వాళ్ళ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. ప్రజలకు జవాబు దారితనంగా పనిచేసే అధికారులు ఇలా ఇఫ్తారీతిన ప్రవర్తించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు సమయానుకూలంగా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Officials skip Praja Vani program
- Advertisement -
RELATED ARTICLES

Latest News