- M/s బహార్ బిర్యానీ కేఫ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని M/s బహార్ బిర్యానీ కేఫ్‌లో(M/s Bahar Biryani Cafe) ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 50 కిలోల కుళ్లిపోయిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన ఇతర ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్న ఈ ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
అదేవిధంగా, కేఫ్‌లోని పలు ఆహార పదార్థాల నమూనాలను అధికారులు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనల నేపథ్యంలో బహార్ బిర్యానీ కేఫ్‌కు సంబంధించిన FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌కు అధికారులు సిఫార్సు చేశారు.

మాంసాహార వంటకాలు విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, పరిశుభ్రత వంటి అంశాలు కీలకం. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిన మాంసం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
