Tuesday, November 11, 2025
ePaper
Homeఆరోగ్యంSleep | ఎక్కువ నిద్రతో ఎక్కువ ప్రమాదం

Sleep | ఎక్కువ నిద్రతో ఎక్కువ ప్రమాదం

రోజూ రాత్రి (Daily Night) సమయంలో ఏడు గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోయేవారికి అకాల మరణం (Untimely Death) ముప్పు 14 శాతం మాత్రమే అయితే.. 9 గంటల కన్నా ఎక్కువ సేపు పడుకునేవాళ్లకు 34 శాతమని పరిశోధకులు (Researchers) గుర్తించారు. అంటే.. ఎక్కువసేపు నిద్రపోతే ఎక్కువ ప్రమాదమని (Danger) చెప్పొచ్చు. గతంలో జరిగిన 79 అధ్యయనాలు (Studies) ఈ విషయాన్ని వ్యక్తం చేశాయి. నిద్ర తక్కువైతే గుండె జబ్బులు(Heart Problems), బీపీ(Bp), మతిమరుపు (Forgetfulness), డిప్రెషన్(Depression) వంటి సమస్యలు వస్తాయి. ఈ ఎఫెక్ట్ మన లైఫ్ టైమ్ (Life Time) మీదా పడుతుందని స్టడీలు చెబుతున్నాయి. అయితే.. ఒక మనిషి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి? అనే సందేహం అందరికీ తలెత్తొచ్చు. దీనికి సమాధానం.. ఏడు గంటలు. ఆరోగ్యవంతుల్లో చాలా మందికి రాత్రి 7 గంటల నిద్ర కావాలి. కానీ కంపల్సరీగా ఏడు గంటలు పడుకోవాలని రూలేం లేదు. కొందరికి 7 గంటల నిద్ర సరిపోవచ్చు. మరికొంత మందికి సరిపోకపోవచ్చు. పడుకొని లేచాక మన శరీరం ఏవిధంగా (హుషారుగా లేదా బద్ధకంగా) ఉందనేదే ప్రధానం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News