- అయితే ఈ కథనం మీకోసమే..
- నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకోండి..
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇంటి అందం కోసమో, పచ్చదనం కోసమో గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం లేకపోయినా కుండీల్లోనే రకరకాల మొక్కల్ని పెంచుకుంటున్నారు. అలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి. ఇంటి గుమ్మం దగ్గర, బాల్కనీ, హాల్ వంటి చోట్ల దీన్ని పెంచుతుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని, ఆర్థిక సమస్యలు తొలుగుతాయని ఎక్కువ మంది భావిస్తుంటారు. అయితే, ఇదే క్రమంలో చాలా మందికి మనీ ప్లాంట్ విషయంలో రకరకాల సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఏ దిక్కులో ఉంటే మంచిది? ఎలా పెంచుకోవాలి? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మరి, మనీ ప్లాంట్ విషయం పాటించాల్సిన కొన్ని నియమాలను చూద్దాం..
మనీ ప్లాంట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవచ్చు.. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకోవాలని అనుకుంటే, శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల మధ్యలో ఏర్పాటు చేసుకోవడం మంచిదట.. సహజంగా మనీ ప్లాంట్ మొక్క ఏర్పాటు చేసుకోవాలని భావించినప్పుడు మీ ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ పక్కన కిటికీ ఉన్నట్లయితే దాని ముందు మనీ ప్లాంట్‌ను ఉంచి ఆ కిటికీలోకి పాకేలా ఏర్పాటు చేసుకోవడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది..
అలాగే, మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ పైకి పాకేలా చూసుకోవాలి. అంతేకానీ, కిందకు పాకేలా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. మనీ ప్లాంట్‌కు పసుపు రంగు ఆకులు వస్తున్నట్లయితే వాటిని కట్ చేస్తుండాలి.
లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ ఇంటి ఆవరణలో ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్‌ను ఉంచడం ఉత్తమం అంటున్నారు. ప్రతీ శుక్రవారం సాయంత్రం పూట ఆ మనీ ప్లాంట్‌కు ఒక ఎరుపు రంగు దారాన్ని కట్టి, ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలట. శుక్రవారం మనీ ప్లాంట్ విషయంలో ఈ పరిహారం పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందట.. సరైన ఉద్యోగం లేక ఇబ్బందిపడేవారేవరైనా సరే మనీ ప్లాంట్‌ను ఇంట్లో బ్లూ కలర్ కుండిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆపై అందులో 11 రూపాయి కాయిన్స్ ఉంచి మట్టి కప్పేయాలి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగప్రాప్తి కలిగే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. అలాగే, ధనలాభం కోసమైతే ఎరుపు రంగు కుండిలో మనీ ప్లాంట్ ఉంచడం మంచిదంటున్నారు.
