Homeవరంగల్‌Celebrations | ఎమ్మెల్యే నాగరాజు జన్మదిన వేడుకలు.

Celebrations | ఎమ్మెల్యే నాగరాజు జన్మదిన వేడుకలు.

  • పాల్గొన్న జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అధ్వర్యంలో వర్ధన్నపేట శాసన సభ్యులు కే.ఆర్.నాగరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

MLA K R Nagaraju Birthday Celebration Warangal District3

ఈ సందర్భంగ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, పార్టీ శ్రేణుల సమక్షములో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
MLA K R Nagaraju Birthday Celebration Warangal District2

ఈ కార్యక్రమంలో పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్, ఉప సర్పంచ్ చింతకుంట్ల అనిత రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కూసం రాంచందర్, మండలములోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News