- అనేక అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ లో చేపట్టాం
- కోకాపేటలో మున్నూరు కాపు భవన నిర్మాణం పూర్తి చేస్తాం
- కుల గణనలో తెలంగాణకు జాతీయ స్థాయి గుర్తింపు
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా ముందుకు వెళ్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్లో జరిగిన మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు స్థానికుడు ఆయన ను ఆశీర్వదించి గెలిపించాలి..జూబ్లీహిల్స్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.. కంటోన్మెంట్ మాదిరి జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి.. యూసుఫ్ గూడా డివిజన్ లో ప్రజల స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు.. రేషన్ కార్డులు వచ్చాయి..సన్న బియ్యం వస్తున్నాయి..
200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం,మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పండి.. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న గారు మున్నూరు కాపు సత్రం కడితే.. ఆ సభ్యుడి కన్నా ఎక్కువగా అండగా నిలబడిన. మన బలహీన వర్గాల బిడ్డకు అవకాశం వచ్చింది.. మనమంతా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలి.. రాబోయే మూడు సంవత్సరాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపెడతాం ”అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోకాపేటలో మున్నూరు కాపు భవనం నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, చట్టబద్ధ మార్గంలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. బలహీన వర్గాలన్నీ ఐక్యంగా పోరాడితేనే తమ హక్కులు సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మున్నూరు కాపు, కాపుల వర్గం నుండి ఏకగ్రీవ మద్దతు లభించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
