- నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్
స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్ను ఈ రోజు లాంచ్ చేశారు. ప్రియదర్శి-ఆనంది జంట మధ్య కెమిస్ట్రీ సహజంగా, చూడముచ్చటగా వుంది. సుమ కనకాల ప్రజెన్స్ కట్టిపడేసింది. వెన్నెల కిషోర్ తన సిగ్నేచర్ టచ్లో నవ్వులు పంచారు.
