Friday, April 17, 2026
Homeమెదక్‌MGNREGA | కూలీలకు నీడ, నీరు తప్పనిసరిగా కల్పించాలి

MGNREGA | కూలీలకు నీడ, నీరు తప్పనిసరిగా కల్పించాలి

  • కూలీల సంఖ్య పెంచాలి
  • డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆచార్య
  • తిగుల్ గ్రామంలో ఉపాధి పనుల పరిశీలన

ఉపాధి హామీ పనులో కూలీల సంఖ్య పెంచాలని, కూలీలకు తప్పనిసరిగా నీడ, నీరు కల్పించాలని డిఆర్డిఏ పిడి జయదేవ ఆచార్య అన్నారు. శుక్రవారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో శ్రీనివాస్ కుంటలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఈ జి ఎస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని పని దినాలను కూడా పెంచాలని చెప్పారు.

గ్రామాల్లో ఉపాధి పనులను గుర్తించి వెంటనే పనులను ప్రారంభించి పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న డబ్బులను వెంటనే త్వరలోనే తమ ఖాతాలో జమ అవుతాయని కూలీలు ఎలాంటి ఆందోళన చెందవద్దని వివరించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పని ప్రదేశంలో నీడ నీరును కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కూలీలకు ఇబ్బంది రాకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

- Advertisement -

ఉపాధి పథకం ద్వారా గ్రామాల్లో రైతుల పంట పొలాలకు వెళ్లే దారులను కూడా బాట వేయడం జరుగుతుందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెరువు మట్టి పూడికతిత ద్వారా పొలాలకు తరలించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రజిత పరశురామ్, ఏపీ ఓ సుధాకర్, ఏపిఎం నరసయ్య, టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్, ఫీల్డ్ అసిస్టెంట్ పార్వతి, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News