- శిబిరాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ కుమార్
- ఓటర్లు వివరాలు సరిచేసుకోవాలని సూచన
మెట్టుగూడ డివిజన్ పరిధిలో సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ జిల్లా జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) శిబిరాలు చురుకుగా కొనసాగుతున్నాయి.మెట్టుగూడ ఎస్.ఐ.ఆర్ శిబిరాలను కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఓటర్లు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి,పేరు,చిరునామా,కుటుంబ వివరాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ నాయకుడు ర్యాల రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ,అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ఎస్ఐఆర్ శిబిరాల్లో విధులు నిర్వహిస్తున్న బీఎల్ఏలు, బీఎల్వోలను సంప్రదించి అవసరమైన మార్పులు,చేర్పులు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు,కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రతి ఓటరు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
