ఇటీవల కొత్తగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) కమిటీ మెంబర్స్ హీరో నాగార్జున(Nagarjuna)ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిగ్‌బాస్ (Big Boss) రియాల్టీ షో సెట్‌లో కలిసి అసోసియేషన్ తరఫున సినీ పాత్రికేయులకు, వారి కుటుంబాలకు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance), యాక్సిడెంటల్ పాలసీతోపాటు పలు సహాయ కార్యక్రమాల గురించి చెప్పారు. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని తెలిపారు. సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా నాగార్జున ప్రశంసించారు. అసోసియేషన్‌కి అక్కినేని (Akkineni) ఫ్యామిలీ నుంచి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని నాగార్జున పేర్కొన్నారు. నాగార్జునను కలిసినవారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వై.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, వైస్ ప్రెసిడెంట్ వంశీ, ప్రేమ, జాయింట్ సెక్రెటరీ జీ.వి, ఇతర కమిటీ మెంబర్స్ ఉన్నారు.
