ఓటర్లకు ఆ పార్టీ ఎన్ఆర్ఐ శాఖ పిలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Suneetha)ను గెలిపించాలని ఆ పార్టీ ఎన్ఆర్ఐ (NRI) శాఖ (London-లండన్) పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని నమ్మి ఓటేసి మోసపోవద్దని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డీసీ (Fdc) మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం కోరారు. హైడ్రా(Hydraa)తో హైదరాబాద్‌ను నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ(Brs Party)ని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకకు బలం చేకూరుతుందని చెప్పారు. కేసీఆర్ (Kcr) నాయకత్వంలో ముస్లిం(Muslim)లకు షాదీ ముబారక్(Shadi Mubarak) వంటి పథకాలతో న్యాయం జరిగిందని బీఆర్ఎస్ యూకే మైనారిటీ నేత అబ్దుల్ జాఫర్ గుర్తుచేశారు. ఇన్నాళ్లూ అన్ని పార్టీలూ అల్ప సంఖ్యాక వర్గాల వారిని ఓటు బ్యాంక్(Vote Bank)గానే చూశాయని, బీఆర్ఎస్ మాత్రమే గౌరవించి అభివృద్ధి చేసిందని వివరించారు.
