Homeమెదక్‌Mahashivratri | చండూరులో మహాశివరాత్రి శోభ

Mahashivratri | చండూరులో మహాశివరాత్రి శోభ

  • మహా శివరాత్రికి ముస్తాబైన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం
  • 15నుంచి 18వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
  • బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసిన దేవస్థాన కమిటీ
  • రామలింగేశ్వరస్వామి కృపకు పాత్రులు కావాలని భక్తజనానికి ఆహ్వానం

ఉమ్మడి మెదక్ జిల్లాలోనే పురాతనమైన శివాలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ చిలిపిచేడ్ మండలం చండూరు గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.చిలిపిచేడ్ మండలంలో ఉన్న ఏకైక శివాలయంగా చండూర్ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ది గాంచింది.

900సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శైవక్షేత్రం ప్రతి ఏటా మహాశివరాత్రికి 4రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రిని పురస్కరించుకొని జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసిన దేవస్థాన కమిటీ సభ్యులు బ్రహోత్సవాలను విజయవంతం చేయాలని భక్తజనాలకు ఆహ్వానం పలికారు.

- Advertisement -
Chandur Sri Ramalingeswara Swamy Mahashivratri Celebrations

15 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

ఈ ఆదివారం 15వ తేదీని నుంచి బుధవారం18వ తేదీ వరకు శ్రీరామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ పేర్కొంది. 15న మహాశివరాత్రి ఉపవాస దీక్షలు,ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు,సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం రాత్రి 8గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతందని,రాత్రి 10గంటల నుంచి మరునాడు ఉదయం వరకు స్వామివారికి అభిషేకాలు,భజన కార్యాక్రమాలతో జాగారం కొనసాగుతుందని పేర్కొన్నారు.

16న సోమవారం ఉదయం 11గంటలకు అన్నదానం జరుగుతుందని,సాయంత్రం 5గంటల నుంచి బండ్లు తిరుగుడు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 17న మంగళవారం ఉదయం 8గంటలకు పాచిబండ్లు తిరిగిన అనంతరం రాత్రి 8గంటలకు అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని,18న బుధవారం సాయంత్రం పాచి రథం తిరిగిన తరువాత రాత్రి లంకాదహనం నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ పేర్కొంది.కావున గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉత్సవాలలో పాల్గొని జాతరను విజయవంతం చేసి శ్రీరామలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News