Homeమెదక్‌MLA Chinta Prabhakar | రైతుల ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు!

MLA Chinta Prabhakar | రైతుల ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు!

  • ప్రతి గింజా కొనాల్సిందే.. రైతుకు భరోసా కల్పించాల్సిందే!
  • సన్న ధాన్యానికి రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలి
  • కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
  • ఎమ్మెల్యే చింత ప్రభాకర్
  • అధికారులకు కీలక సూచనలు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులందరికీ సమాన ప్రాధాన్యత కల్పించాలని, దళారీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించాలని సూచించారు. ప్రతి క్వింటాల్ సన్న ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ తప్పనిసరిగా అందించాలని, గత ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను సైతం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

- Advertisement -

రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, పంట రుణాలు, ఎరువుల కొరత వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని ఎమ్మెల్యే చింత ప్రభాకర్()(MLA Chinta Prabhakar) పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కొనుగోలు ప్రక్రియలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ చైర్మన్ రాముగోపాల్, మాజీ డీసీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ శివనాథ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు అంజనేయులు, చక్రపాణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సుధాకర్, లక్ష్మారెడ్డి, సర్వం అశోక్ గౌడ్, రాజు, మనీష్ గౌడ్, పీసీసీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News