Friday, April 17, 2026
Homeఆదిలాబాద్Reservation | మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కల్పించాలి

Reservation | మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కల్పించాలి

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15 శాతం రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం జనాభా ప్రతిపాదికన 11 శాతం రిజర్వేషన్లు మాదిగలకు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. మాదిగల జనాభా 10 నుంచి 11 శాతం ఉంటుందని తమ అధినేత మందకృష్ణ మాదిగ మొదటి నుంచి చెప్తున్నారని, అది కుల గణన సర్వే తో స్పష్టమైందని పేర్కొన్నారు.

ప్రస్తుతం మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉందన్నారు. అంతేకాకుండా మాదిగల్లో ఉన్న పేదరికం తొలగించడానికి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలన్నారు. లేదంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇందులో ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు అంబేకర్ సాయిచంద్ , ఎంఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి బిక్కీ మురళీకృష్ణ , ఎమ్మార్పీఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నల్లూరి అరుణ్ కుమార్ , నాయకులు రాజు, లక్ష్మణ్ ,సిరిమన్ బాబు, వాగ్మారి మారుతి ,తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News