Friday, April 17, 2026
Homeఆరోగ్యంJunk Food | 60 రోజుల పాటు జంక్ ఫుడ్‌ను మానేయండి..

Junk Food | 60 రోజుల పాటు జంక్ ఫుడ్‌ను మానేయండి..

  • జరిగే అద్భుతాన్ని ఆస్వాదించండి..
  • నిపుణులు చెబుతున్నది ఏమిటి..?

జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మందికి తెలుసు. అయితే దాన్ని పూర్తిగా 60 రోజుల పాటు మానేస్తే శరీరంలో కనిపించని లోతైన మార్పులు జరుగుతాయి. ప్రాసెస్ చేసిన స్నాక్స్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్‌ను ఆపేసినప్పుడు శరీరం దెబ్బతిన్న వ్యవస్థలను మళ్లీ సరిచేసుకోవడం ప్రారంభిస్తుంది. తాజా పరిశోధనలు తెలిపిన ప్ర‌కారం కొద్ది రోజులపాటు జంక్ ఫుడ్‌కు విరామం వ‌ల్ల‌ ఆకలి నియంత్రణ, జీర్ణ వ్య‌వ‌స్థ‌ ఆరోగ్యం, మెట‌బాలిజం మెరుగుపడటానికి దోహదం చేస్తుంద‌ని వెల్ల‌డైంది. మొదట‌ కొన్ని వారాలు శుద్ధి దశలా ఉండగా, తర్వాత శక్తి స్థిరంగా మారుతుంది.

60 రోజుల పాటు జంక్ ఫుడ్ మానేస్తే శరీరంలో ఎటువంటి మార్పులు జ‌రుగుతాయో వైద్యులు వివ‌రిస్తున్నారు. 60 రోజుల పాటు జంక్ ఫుడ్ మానేయ‌డం వ‌ల్ల ఆకలి హార్మోన్లు సమతుల్యం అవుతాయి. జంక్ ఫుడ్ వల్ల ఆకలి నియంత్రణ దెబ్బతింటుంది. దీనివల్ల ఎక్కువగా తినే అలవాటు ఏర్పడుతుంది. అయితే 60 రోజుల పాటు దాన్ని మానేస్తే లెప్టిన్, ఘ్రెలిన్ వంటి ఆకలి హార్మోన్లు సరిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. దాంతో తృప్తి భావం సరిగ్గా తెలుస్తుంది.

- Advertisement -

ఇక జంక్ ఫుడ్ మానేయ‌డం వ‌ల్ల మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. జంక్ ఫుడ్ మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మెమొరీ, ఆకలి నియంత్రణపై ప్రభావం చూపుతుంది. 60 రోజుల తర్వాత మెదడు మళ్లీ సరిగా స్పందించడం ప్రారంభించి, ఫోకస్ పెరుగుతుంది, అనవసరమైనవి తినాలనే కోరికలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) తగ్గుతుంది. జంక్ ఫుడ్ వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News