Friday, April 17, 2026
Homeఆదిలాబాద్TCA | టీసీఏ ఆల్ స్టార్ టీ20 సూపర్ లీగ్

TCA | టీసీఏ ఆల్ స్టార్ టీ20 సూపర్ లీగ్

తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువక్రికెటర్లను వెలికి తీస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్( టీసీఏ) ఆల్ స్టార్ టీ20 సూప ర్ లీగ్ నిర్వహిస్తుందని టిసిఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నీ ఏప్రిల్ 20 నుంచి వరంగల్ లో జరుగుతుందని,దీనిలో పాల్గొనే ఆరు జట్లను టీసీఏ రాష్ట్ర కమిటీ ప్రకటించిందన్నారు.

ఇందులో నిర్మల్ జిల్లా క్రీడాకారులు గత ఏడాది నిర్వహించిన తెలంగాణ గోల్డ్ కప్ అంతర్ జిల్లా లీగ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి ,ఆల్ స్టార్ టీ20 సూపర్ లీగ్ కు ఎంపికయ్యారన్నారు.తెలంగాణలోని 32 జిల్లాల్లో ఎంతో ప్రతిభ ఉందని, వారికి టీసీఏ చక్కని వేదికగా మారిందని, హెచ్సీఏ తెలంగాణ జిల్లాల క్రికెట్ అభివృద్ధిని పట్టించుకోకున్నా, టీసీఏ మాత్రం ప్రతీ ఏడాదీ టోర్నీలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఆల్ స్టార్ టీ 20 లీగ్ లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News