Homeఆరోగ్యంLoneliness | ఒంటరితనం చాలా ప్రమాదం..

Loneliness | ఒంటరితనం చాలా ప్రమాదం..

  • మానసిక స్థితిగతులపై ప్రభావం..
  • జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్ధ్యం క్షీణిస్తాయి..

ఒంటరితనం అనేది కేవలం మనసును మాత్రమే కాదు, మెదడు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే సమస్యగా తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎక్కువ కాలం పాటు సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, దీర్ఘకాలంలో చిత్తవైకల్యం (డిమెన్షియా) వంటి నరాల సంబంధిత వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంద‌ని చెబుతున్నారు.

సామాజిక సంబంధాలు మెదడు చురుకుదనాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరచూ మాట్లాడటం, అనుభవాలను పంచుకోవడం, కొత్త విషయాలపై చర్చించడం వంటి చర్యలు మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజపరుస్తాయి. అయితే, ఎక్కువ కాలం ఒంటరిగా గడిపే వారిలో శరీరంలో కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయులు పెరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంగా నిద్రలో అంతరాయం, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News