- ఎత్తైన ప్రాంతాలు సందర్శించరాదు..
- సరైన ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాలి..
లడాఖ్, కాశ్మీర్, స్పితి వ్యాలీ వంటి ఎత్తైన పర్వత ప్రాంతాలను సందర్శించడం చాలామంది ప్రయాణికుల కల. అయితే ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారిలో ఒక సందేహం తరచూ ఉంటుంది. అలాంటి వారు అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలకు సురక్షితంగా ప్రయాణించవచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. అయితే ఇందుకు శ్వాసకోశ నిపుణులు సమాధానం చెబుతున్నారు.
సరైన ప్రణాళిక, వైద్యుల సలహా, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది రోగులు కూడా ఇలాంటి ప్రాంతాలను సురక్షితంగా సందర్శించవచ్చని వారు పేర్కొంటున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లే కొద్దీ గాలిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గుతాయి. దీంతో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. ఆరోగ్యవంతులకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలనొప్పి, ఎత్తు ప్రభావానికి సంబంధించిన లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి.
