Homeకరీంనగర్Korutla Illegal Layout | కోరుట్లలో అక్రమ లేఔట్ల వ్యవహారం కలకలం..!?

Korutla Illegal Layout | కోరుట్లలో అక్రమ లేఔట్ల వ్యవహారం కలకలం..!?

  • బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్ల ఫిర్యాదు..!Korutla Illegal Layout
  • సర్వే నంబర్‌ 1490లో ఏం జరుగుతోంది..?
  • 4.12 ఎకరాల భూమిలో లేఔట్‌ అనుమతులు లేకుండానే ప్లాట్ల విక్రయాలా..?
  • నిబంధనలు ఉల్లంఘిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు..?Korutla Illegal Layout
  • ఫిర్యాదులపై స్పందించని అధికార యంత్రాంగం..?
  • రిజిస్ట్రేషన్ల వెనుక అసలు కథేంటి..?Korutla Illegal Layout

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అనధికార లేఔట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కోరుట్ల పట్టణ పరిధిలోని సర్వే నంబర్‌ 1490లో సుమారు 4.12 ఎకరాల భూమికి సంబంధించి లేఔట్‌ అనుమతులు, ప్లాట్ల విక్రయాలపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీకి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ ఫిర్యాదు చేయడంతో లేఔట్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

4.12 ఎకరాల భూమిపై వివాదం..!

- Advertisement -

కోరుట్ల పట్టణంలోని సర్వే నంబర్‌ 1490లోని భూమిని వివిధ సబ్‌ డివిజన్లుగా విభజించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత భూమికి మున్సిపల్‌, డీటీసీపీ అనుమతులు లేకుండానే లేఔట్‌ ఆమోదం పొందకుండానే అనేక ప్లాట్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్ని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలనే డిమాండ్‌ వారు డిమాండ్ చేశారు.

బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదుతో కదలిక వస్తుందా..?Korutla Illegal Layout

ఇప్పటికే ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుండగా, తాజాగా బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలకు సంబంధించిన భూములు, లేఔట్‌ అనుమతులు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పారదర్శకత ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదుల్లో కోరినట్లు వారు తెలిపారు..

అధికారుల మౌనం ఎందుకు..?Korutla Illegal Layout

ఒకవైపు అనధికార లేఔట్లపై ఫిర్యాదులు వస్తున్నా, మరోవైపు ప్లాట్ల విక్రయాలపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని. సర్వే నంబర్‌ 1490లోని భూమికి సంబంధించిన రికార్డులు, లేఔట్‌ అనుమతులు, జరిగిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ,ఇందూరి తిరుమల వాసు కోరుతున్నారు.

మొత్తానికి సర్వే నంబర్‌ 1490లోని 4.12 ఎకరాల భూమి వ్యవహారంపై బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్ల ఫిర్యాదుతోనైనా అధికారులు స్పందిస్తారా..? లేఔట్‌ లేని భూమి పై చర్యలు తీసుకుంటారా…? ప్లాట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై అధికారులు విచారణ చేపడతారా..? అన్నది వేచి చూడాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News