Homeకరీంనగర్Korutla Town Planning | కోరుట్ల టౌన్ ప్లానింగ్‌లో ఇదేం విచిత్రం...!

Korutla Town Planning | కోరుట్ల టౌన్ ప్లానింగ్‌లో ఇదేం విచిత్రం…!

  • కమిషనర్ మాట ఒకటి…టౌన్ ప్లానింగ్ అధికారి మరొకటి….!Korutla Town Planning
  • లేఔట్లు లేని ప్లాట్లకు అనుమతులెట్లా….?
  • జీవో పేరుతో ఏదైనా చేయొచ్చా….?
  • ప్రశ్నిస్తే దురుసు సమాధానాలు… ఇదేనా ప్రజాపాలన….?
  • డబ్బులిస్తే పనులు చకచకా సాగుతాయా….?

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారుల తీరు ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారుతోంది (Korutla Town Planning). లేఔట్ అనుమతులు లేని ప్లాట్ల విషయంలో మున్సిపల్ కమిషనర్ ఒకలా చెబుతుంటే, టౌన్ ప్లానింగ్ అధికారి మరోలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు ఒక రకమైన సూచనలు… అనుమతుల విషయంలో మాత్రం మరో రకమైన విధానం… ఇదేం విచిత్రమని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కమిషనర్ హెచ్చరికలు…టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతులా….?Korutla Town Planning

- Advertisement -

లేఔట్ అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేయవద్దని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఇదే మున్సిపాలిటీలో లేఔట్‌లో లేని ప్లాట్లకు టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతులు ఎలా మంజూరు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకవైపు అనుమతులు లేని ప్లాట్లు కొనవద్దని ప్రజలకు సూచనలు… మరోవైపు అలాంటి ప్లాట్లకు అనుమతులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు… అసలు కోరుట్ల మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది…? కమిషనర్‌కు ఒక నిబంధన… టౌన్ ప్లానింగ్ అధికారికి మరో నిబంధనా…?

జీవో ప్రకారం అంటున్నారు… ఆ జీవో ఏది…..?

లేఔట్ అనుమతులు లేని ప్లాట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తే, జీవో ప్రకారం అనుమతులు మంజూరు చేస్తున్నామని అధికారి సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఆ జీవో ఏది…? దాని ప్రకారం ఎలాంటి ప్లాట్లకు అనుమతులు ఇవ్వవచ్చు….? ఏయే నిబంధనలు వర్తిస్తాయి…? ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులపై లేదా…?

జీవో పేరుతో అనుమతులు మంజూరు చేస్తున్నప్పుడు నిబంధనలు, అనుమతి పత్రాలు, సంబంధిత వివరాలు పారదర్శకంగా వెల్లడించాలి. కానీ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తున్నాయి.

Korutla Municipality Town Planning Department facing questions over alleged permissions for plots in unapproved layouts

డబ్బులిస్తే ఏ పనైనా సాధ్యమేనా…..?Korutla Town Planning

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో డబ్బులు ఇస్తే ఏ పనైనా సులభంగా పూర్తవుతుందా…? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అనుమతుల మంజూరులో పారదర్శకత ఉందా….? నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా…? అనే అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది..

ఉన్నతాధికారులు స్పందించాలి….!Korutla Town Planning

కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ప్రకటనలకు, టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతుల విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలి. లేఔట్ అనుమతులు లేని ప్లాట్లకు ఏ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలి.

ప్రజలకు నిబంధనలు చెప్పే అధికారులు… ఆ నిబంధనలను తామే పాటిస్తున్నారా…?

కోరుట్ల టౌన్ ప్లానింగ్ విభాగంలో అనుమతుల వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణ ఎప్పుడు….? ప్రజల అనుమానాలకు సమాధానం చెప్పేది ఎవరు….?(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News