Homeమెదక్‌Sarpanch | ప్రజల కోసం.. ప్రజల మధ్యే.. నిత్యం అందుబాటులో సర్పంచ్

Sarpanch | ప్రజల కోసం.. ప్రజల మధ్యే.. నిత్యం అందుబాటులో సర్పంచ్

  • పంచాయతీ కార్యాలయంలోనే ఉంటూ ప్రజలకు సేవలు..Sarpanch
  • ఇందిరమ్మ జీవిత బీమా నమోదు బాధ్యతను స్వయంగా చేపట్టిన సర్పంచ్
  • బిజీ వెంకటాపూర్ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా బిజీ వెంకటాపూర్ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలనే ఉద్దేశంతో పంచాయతీ కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు స్వయంగా కంప్యూటర్‌లో వివరాల నమోదు బాధ్యతను చేపట్టడం విశేషం. ప్రజలు చిన్నచిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.Sarpanch

ఉదయం నుంచే పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ బీమా నమోదు ప్రక్రియను పర్యవేక్షించడమే కాకుండా, అవసరమైన వివరాలను స్వయంగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులెవరూ లబ్ధికి దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామాభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.Sarpanch

- Advertisement -

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ప్రజలకు అవసరమైన పనులను తన బాధ్యతగా భావించి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎంత చేరువగా ఉంటే ప్రభుత్వ పథకాలు అంత సమర్థవంతంగా అమలవుతాయనే దానికి ఆయన పనితీరు నిదర్శనంగా నిలుస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావంతో విధులు నిర్వహిస్తున్న సర్పంచ్‌పై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇతర గ్రామాల ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి సేవా దృక్పథంతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత వేగంగా ప్రజలకు చేరుతాయని పలువురు పేర్కొంటున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News