- కీలక ముందడుగు వేసిన ఏపీ ప్రభుత్వం..AP Investment Protection Act
- ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ – 2026 చట్టం..
ఏపీలో పారిశ్రామిక ప్రగతికి శాశ్వత భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు వేసింది. రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే లక్ష్యంతో ‘ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్-2026’ పేరుతో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతోంది.AP Investment Protection Act
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పారిశ్రామిక విధానాలు, రాయితీలు మారిపోతాయనే పెట్టుబడిదారుల ఆందోళనలను తొలగించడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. దేశంలోనే తొలిసారిగా రూపొందిస్తున్న ఈ వినూత్న చట్టాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా కేవలం రెండు వారాల్లోనే పరిశ్రమల శాఖ ఈ చట్టం ముసాయిదాను సిద్ధం చేసింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులు దీనిపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం మారినా తాము ఇచ్చిన హామీలు, కేటాయింపులు రద్దు కాకుండా కఠినమైన చట్టం తెస్తామన్న సీఎం మాటలకు అనుగుణంగా ఈ ముసాయిదా రూపుదిద్దుకుంది.
ఐదు కీలక అంశాలతో రక్షణAP Investment Protection Act
ఈ కొత్త చట్టం ద్వారా పారిశ్రామిక పెట్టుబడులకు ఐదు కీలకమైన అంశాల్లో చట్టపరమైన రక్షణ లభిస్తుంది.
- భూ కేటాయింపులు: పరిశ్రమలకు కేటాయించిన భూములను తర్వాతి ప్రభుత్వాలు ఏకపక్షంగా రద్దు చేయకుండా నిబంధనలు ఉంటాయి.
- ప్రోత్సాహకాలు: ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలను భవిష్యత్తులో తగ్గించడం లేదా రద్దు చేయడం సాధ్యపడదు.
- అనుమతులు: పరిశ్రమల ఏర్పాటుకు జారీ చేసిన అనుమతుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరత్వం ఉంటుంది.
- సదుపాయాలు: ప్రాజెక్టులకు కేటాయించిన నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.
- చెల్లింపులు: ఎస్క్రో విధానంలో ప్రోత్సాహకాలు చెల్లించే నిర్ణయాలను రద్దు చేయకుండా భద్రత కల్పిస్తారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
