వరంగల్ జిల్లా పర్వతగిరి మండల నూతన (Agriculture Officer) వ్యవసాయ అధికారిగా ఎం.డి. జావిద్ ఖాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీ పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
మండలంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
- Advertisement -
