HomeతెలంగాణKonda Surekha | సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు..

Konda Surekha | సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు..

  • కాంగ్రెస్ అధిష్ఠానానికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు..
  • సంచలనం సృష్టిస్తున్న కొండా సురేఖ రాహుల్ గాంధీకి రాసిన లేఖ..

తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) రాసిన లేఖ(Letter) రాష్ట్ర రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా, పరిపాలనాపరంగా అణచివేస్తున్నారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై ఆమె నేరుగా రాహుల్ గాంధీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. 31 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న బీసీ మహిళా నాయకురాలినైన తనను ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్ర వివక్షకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన లేఖలో మంత్రి కొండా సురేఖ ప్రస్తావించిన ముఖ్యమైన విషయాలు :

తన శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తనకు తెలియకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకుంటోందని, దేవాదాయ శాఖలో యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, సమ్మక్క – సారలమ్మ ఆలయ నిధుల మళ్లింపు వంటి వాటిలో తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. శ్రీరామ నవమి ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫోటోను కావాలనే తొలగించారని పేర్కొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వ్యాఖ్యలు చేసే ఇతర నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఒక బీసీ మహిళా నాయకురాలినైన తనపై మాత్రం వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడం సరికాదని అన్నారు.

తన మాజీ ఓ ఎస్ డీ సుమంత్‌ను తనకు సమాచారం లేకుండా తొలగించడమే కాకుండా, ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులను అధికారిక నివాసానికి పంపడం తన పదవిని, ఆత్మగౌరవాన్ని భంగపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొంధి వాగు విస్తరణ వంటి ముఖ్యమైన అభివృద్ధి పనులకు నిధుల విడుదల చేయకుండా తీవ్ర ప్రాధాన్యతా లోపం చూపుతున్నారని వివరించారు.

దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని, దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాజకీయంలో సీఎం ప్రోత్సాహంతో కొండా కుటుంబాన్ని ఏకాకిని చేసేందుకు కొంతమంది నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి, తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీని కోరారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, వీడియోలను ఒక పెన్ డ్రైవ్‌లో పెట్టి ఈ లేఖతో పాటు అధిష్ఠానానికి సమర్పించినట్లు కొండా సురేఖ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News