- అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం..
- ఈనెల 19 – 22 వరకు జరగనున్న ఐ.ఆర్.సి.
- అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి..
- సూచించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి..
అత్యంత ప్రతిష్టాత్మకంగా 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.. 19నాడు ముఖ్య అతిథులు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు,అన్ని రాష్ట్రాల రోడ్లు భవనాలు శాఖ మంత్రులు, వివిధ దేశాల నుండి ఇతర రాష్ట్రాల డెలిగెట్స్ హాజరుకానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(Komatireddy Venkat Reddy) తెలిపారు.. అతిథులకు వసతి, ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకూడదని అధికారులను కోరారు.. అందుకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో ఐ.ఆర్.సి. సదస్సు ఏర్పాట్లు ఉండాలి.. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా,తెలంగాణ ప్రగతి తెలిసే విధంగా.. ప్రత్యేకంగా “తెలంగాణ పెవిలియన్” ఏర్పాటు చేయాలి.

అన్ని మాధ్యమాల్లో ఐ.ఆర్.సి.పై విస్తృత ప్రచారం చేయాలి.. హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్,మెట్రో స్టేషన్,రైల్వే స్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రదేశాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక విజువల్ ప్రకటనలు ప్రదర్శించాలి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్ పోర్టు, మెట్రోలో కూడా ప్రకటనలతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిసెంబర్ లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే గ్లోబల్ సమ్మిట్ (ఇన్వెస్ట్ తెలంగాణ)కు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రీ “ఇన్వెస్ట్ తెలంగాణ” సమ్మిట్ గా నిలిచేలా చేయాలి. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలఅని మంత్రి పిలుపునిచ్చారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

