Homeహైదరాబాద్‌Kishan Reddy | కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు

Kishan Reddy | కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు

  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా సీఎం రేవంత్
  • రెండేళ్లలో ఏం చెప్పారో.. ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయింది
  • ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో ఏం చెప్పారో.. ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయిం దని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్తితి లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

kishan reddy slams revanth reddy congress jubilee hills

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు, భారత రాష్ట్ర సమితికి మధ్య ఎలాంటి అవగాహనా ఒప్పందం జరగలేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని.. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి మధ్యనే అవగాహన కుదిరిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో పాటు జూబ్లీహిల్స్లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా? కాళేశ్వరం కేసుపై విచారణ జరిపిస్తామని మేం ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు. ముందు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. ఆ తర్వాత మిగతా విషయాలు చర్చిద్దాం” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News