Friday, November 14, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుPDS Rice | అక్రమ నిల్వ కేసులో నిందితుడికి రిమాండ్‌

PDS Rice | అక్రమ నిల్వ కేసులో నిందితుడికి రిమాండ్‌

హైదరాబాద్ కమిషనరేట్ మధ్య మండలం డీసీపీ వెల్లడి

హైదరాబాద్‌, నవంబర్‌ 5 (ఆదాబ్‌ హైదరాబాద్‌ ): ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని (PDS Rice) అక్రమంగా నిల్వ (Illegal Storage) ఉంచిన గోదాం(Godown)పై పోలీసులు దాడి చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ కమిషనరేట్‌ మధ్య మండలం ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఖైరతాబాద్‌‌ బీజేఆర్‌ నగరకు చెందిన అబ్దుల్‌ రహెమాన్‌ రేషన్ బియ్యాన్ని కార్డుదారుల (Card Holders) నుంచి తక్కువ ధరకు కోనుగోలు చేస్తుంటాడు. ఆ ఇంటిలోని గోదాంలో నిల్వ చేసి నల్లబజార్‌(Black Market)కు తరలిస్తాడు. ఓ వ్యక్తి గోదాం నుంచి రేషన్‌ బియ్యాన్ని వేరే చోటకి ఆటోలో తరలిస్తున్నాడని పోలీసులకు విశ్వనీయ సమాచారం (Pakka Information) అందింది. దీంతో డీసీపీ పార్టీ టీం.. స్థానిక పోలీసులతో కలిసి గోదాంపై ఆకస్మికంగా దాడి చేసి 27 బస్తాల్లోని 10 క్వింటాల బియ్యాన్ని, ఆటో(టీఎస్‌ 09ఎఫ్‌వీ3081)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిడు మహ్మద్‌ అజర్‌(24)ను అదుపులోకి తీసుకొని తదుపరి దర్యాప్తు నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. వారు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News