- రాష్ట్ర యోగా పతక విజేతలకు మంత్రుల అభినందన..
- జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి.
- మంత్రులు బండి సంజయ్ పొన్నం ప్రభాకర్.
భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక యోగా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు శనివారం ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఎస్ఎంపీ అంతర్జాతీయ పాఠశాలలో తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా యోగా క్రీడాకారులను అభినందిస్తూ జాతీయస్థాయిలో కూడా పథకాలు సాధించాలని కోరినారు ప్రపంచానికి భవద్గీతను అందించిన భారతదేశం నేడు యోగాను విశ్వవ్యాప్తంగా అమలు చేయడం భారతదేశము యొక్క కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.
రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యోగా సాధన వలన సార్వత్రిక శక్తి ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని, వ్యక్తి పరిపూర్ణతకు యోగా దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వా ములు కావాలని ఆయన కోరారు. యోగాను ముందు తరాల వారికి అందించాలనే లక్ష్యంతో యోగా క్రీడాకారుల సంక్షేమాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను స్పోర్ట్స్ కోటాలో చేర్చారని తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.
ఎంపికైన క్రీడాకారులు రాంచి లో ఈనెల 27 నుంచి 30 వరకు జరుగు జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వి. అంజనీ కుమార్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, కార్యదర్శి గుంటి రామకృష్ణ, కోశాధికారి పి. స్వరూప చారి, బండ రమణారెడ్డి యోగ కోచులు కిష్టయ్య ,ఆనంద కిషోర్, ప్రవీణ్ , వీణ తదితరులు పాల్గొన్నారు

