హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్ఐపి అబాకస్ పోటీలలో కరీంనగర్ రేకుర్తి లోని విజన్ హై స్కూల్ లో 4వ,తరగతి చదువుతున్న విద్యార్థిని ఆర్. చైత్ర రెడ్డి పాల్గొని బంగారు పతకం తో పాటుగా ట్రోఫీ ప్రశంసా పత్రం సాధించింది. బంగారం పథకం సాధించిన విద్యార్థినిని విజన్ హై స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడం ఎంతో గర్వకారణం అని సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు అకాడమిక్ తో పాటుగా అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విజన్ హై స్కూల్ డైరెక్టర్ సందవేణి వెంకట్, ఇంచార్జ్ ప్రతిభ భారతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
