- సదాశివపేటలో హోరెత్తుతున్న వీరాభిమాని కళ్యాణ్ రాజ్ నినాదంJagga Reddy
రాజకీయాల్లో పదవులు వస్తాయి, పోతాయి.. కానీ నాయకుడిపై ఉండే నిబద్ధత, నమ్మకం ఎప్పటికీ మారవని నిరూపిస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత, (Jagga Reddy) మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వీరాభిమాని కళ్యాణ్ రాజ్. నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ, ఎల్లప్పుడూ ఆయన వెన్నంటే నిలుస్తున్న కళ్యాణ్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సదాశివపేటతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
”రాజకీయాల్లో ఏది గెలిచాం, ఏది ఓడాం అన్నది ముఖ్యం కాదు.. అంతకంటే ముందు మేము మా జగ్గారెడ్డి అన్న మనసు గెలిచాం!” అంటూ కళ్యాణ్ రాజ్ ఉద్వేగభరితంగా స్పష్టం చేశారు. నాయకుడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాలను చాటుతూ, “చావైనా బతుకైనా అన్న వెంటే మా ప్రయాణం. ఆయన ఎక్కడుంటే మేం అక్కడే ఉంటాం.. ప్రాణం ఉన్నంతవరకు అన్న నీడలా తోడుంటాం” అని చేసిన ప్రకటన స్థానిక కార్యకర్తల్లో, యువతలో నూతనోత్సాహాన్ని నింపింది.
నిఖార్సయిన అభిమానానికి, అంకితభావానికి నిదర్శనంగా మారిన కళ్యాణ్ రాజ్ విధేయత ప్రస్తుతం సదాశివపేట రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
