సదాశివపేట: సదాశివపేట మండలంలోని సిద్ధాపూర్ గ్రామ(Siddapur Villagers) 7వ వార్డు ప్రజల కోసం ప్రభుత్వ స్థలాన్ని శ్మశాన వాటికగా కేటాయించాలని కోరుతూ స్థానికులు శనివారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించుకోవడానికి సరైన శ్మశాన వాటిక స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఊరి చుట్టూ పొలాలు, ఇళ్ల స్థలాలు మాత్రమే ఉండటంతో మృతదేహాల దహన సంస్కారాలు, ఖననం చేసేందుకు స్థలం కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో శ్మశాన వాటికకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొల్ల కిష్టయ్యగారి ఎండి అయూబ్ పాషా, రాంరెడ్డి, మంగళ అమృతయ్య, బంటు శంకరయ్య, బోయిని శ్రీనివాస్, అనంతరాంగౌడ్, మున్నూరు లక్ష్మణ్, సంగం చంద్రశేఖర్, చౌకలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
