- ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణపతాకం..
- చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్..
ఆసియా క్రీడలు 2026లో భారత రెజ్లర్ అమన్ శెహ్రావత్(Aman Sehrawat) సంచలనం సృష్టించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ హాన్ చోంగ్ సాంగ్‌ను 11-7 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించాడు. దీంతో ఈ విభాగంలో ఆసియా క్రీడల స్వర్ణం గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా అమన్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో భారత స్వర్ణ పతకాల సంఖ్య 20కు చేరింది.(Historic Gold)
నగోయా సిటీ ఇనాయే స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన ఫైనల్ హోరాహోరీగా సాగింది. రెండో భాగంలో అమన్ 6-1 ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఉత్తర కొరియా రెజ్లర్ పుంజుకున్నాడు. వరుస పాయింట్లతో 7-6 ఆధిక్యంలోకి వెళ్లాడు. సమయం ముగిసే దశలో అమన్ అద్భుతంగా పుంజుకున్నాడు. టేక్‌డౌన్‌తో రెండు పాయింట్లు సాధించి, ఆ తర్వాత రోల్ ద్వారా మరో రెండు పాయింట్లు దక్కించుకున్నాడు. దీంతో 11-7 ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థి ఆ పాయింట్లపై ఛాలెంజ్ చేసినా ఫలితం లేకపోయింది. పైగా ఒక పాయింట్ కోల్పోవడంతో అమన్ ఆధిక్యం మరింత పెరిగింది. చివరి 30 సెకన్లలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
