- వైరల్ గా మారిన వీడియో..Ganesh Idol
- పాకిస్తాన్ లో వెలుగు చూసిన ఘటన..
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. పాకిస్థాన్‌లోని(Pakistan) కరాచీ నుంచి వెలువడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరాచీలో నివసిస్తున్న ఓ మరాఠీ కుటుంబం కోసం ఓ ముస్లిం కళాకారుడు గణపతి విగ్రహానికి(Ganesh Idol) రంగులు వేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కరాచీలోని మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం నిర్వహిస్తున్న గణేశ్ మఠ్ మందిర్‌లో ఈ విగ్రహానికి రంగులు అద్దినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను కరాచీలో నివసించే మరాఠాగా తనను తాను పరిచయం చేసుకున్న అమర్ ప్రకాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘కరాచీలో మహారాష్ట్ర కుటుంబం నిర్వహిస్తున్న గణేశ్ మఠ్ మందిర్‌లో గణపతి బప్పాకు ముస్లిం కళాకారుడు రంగులు వేస్తున్నారు’’ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
