Friday, November 14, 2025
ePaper
Homeహైదరాబాద్‌JubileeHills | జూపల్లి, ఆత్రం సుగుణక్క ప్రచారం

JubileeHills | జూపల్లి, ఆత్రం సుగుణక్క ప్రచారం

నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి పిలుపు

బీఆర్‌ఎస్‌, బీజేపీలను నమ్మి మోసపోవద్దన్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Bye Election)లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) అభ్యర్థి నవీన్‌ యాదవ్‌(Naveen Yadav)కు మద్దతుగా ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao), టీపీసీసీ ఉపాధ్యక్షురాలు(TPCC Vice President), ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ (Adilabad Parliament in-charge) ఆత్రం సుగుణక్క (Atram Sugunakka) స్థానిక నాయకులతో కలిసి బుధవారం బోరబండ డివిజన్‌లో ప్రచారం చేపట్టారు. మహిళలతో కలిసి సుగుణక్క ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు ఓటేయాలని కోరారు. మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే పేదలకు ఇందిరమ్మ ఇల్లు, విద్యుత్‌ వెలుగులు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా, ట్రాఫిక్‌ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సుగుణక్క కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను మంత్రి జూపల్లి వివరించారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News