Friday, November 14, 2025
ePaper
Homeహైదరాబాద్‌JubileeHills | చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రచారం

JubileeHills | చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రచారం

సీఎం, మంత్రుల ర్యాలీకి ఘన స్వాగతం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌(Naveen Yadav)కి మద్దతుగా ఈరోజు రహమత్ నగర్ డివిజన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి(TPCC General Secretary), మాజీ మేయర్ (Ex Mayor) చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి (Chigirintha Parijatha Narasimha Reddy) ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు.

అంతకుముందు బూత్ కమిటీ సభ్యులు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి సీఎంకి, రెహమత్ నగర్ డివిజన్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిగిరింత దయాసాగర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సిరిగని సాయి ముదిరాజ్, నయనా చారి, గిరి ముదిరాజ్, మసూద్, కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News