తదనంతరం కొత్తకోట మునిసిపాలిటీ పరిధిలోని PACS మీటింగ్ హాల్ జరిగిన సమావేశంలో జెసి వినోద్ కుమార్ రైతులతో మాట్లాడుతూ సకాలంలో మీ ధాన్యం కొనుగోలు చేస్తాం అని హామీ ఇచ్చారు.ధాన్యాన్ని తరలించడానికి అవసరమైన DCM లు , లారీలు అందుబాటులో సిద్ధంగా ఉంచాము అని తెలియజేశారు. నిన్న కురిసిన అకాలవర్షనికి ఆరుగాలం కస్టపడి పండించిన ధాన్యం తడిసిపోయిందని రైతులు జేసీకి తమ గోడు వినిపించారు. జేసీ వినోద్ కుమార్ రైతులు ఎవరు అధైర్య పడవద్దని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
జేసీ వినోద్ కుమార్,MRO తోపాటు సంబంధిత అధికారులకు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేయాలనీ ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లరాదని సూచించారు. ఈ సంధర్బంగా కొత్తకోట పట్టణ రైతులు ఎమ్మేల్యే జి.మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్,పట్టణ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, AO, AEO లు రైతులు తదితరులు పాల్గొన్నారు.
