Homeవరంగల్‌Collector Satya Sharada | అంగన్‌వాడీ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్.

Collector Satya Sharada | అంగన్‌వాడీ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్.

  • చిన్నారులకు యూనిఫాం తప్పనిసరిగా ఉండాలి.
  • రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి.
  • క్రమం తప్పకుండా తనిఖీ చేయని అంగన్‌వాడీ సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి.
  • బుద్ధి మాధ్యమంతో ఉన్న పిల్లలను భవిత సెంటర్లకు పంపించాలి.
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
Satya Sharada Inspects Anganwadi Centers in Warangal 1

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఉట్టితండా, దౌలత్‌ నగర్ అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత సరిగా పాటించకపోవడంపై సంబంధిత అంగన్‌వాడీ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులకు యూనిఫాం తప్పనిసరిగా ఉండేలా చూడాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. శుభ్రత పరిశుభ్రత తప్పనిసరిగా ఉండేలా ఆయాలు చూడాలని ఆదేశించారు.

Satya Sharada Inspects Anganwadi Centers in Warangal3 1

అంగన్‌వాడీ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కూడా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించని అంగన్‌వాడీ టీచర్లకు, కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయని అంగన్‌వాడీ సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.

- Advertisement -
Satya Sharada Inspects Anganwadi Centers in Warangal4

ఉట్టి తండ లోని బుద్ధి మాధ్యమంతో ఉన్న పిల్లలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద (Collector Satya Sharada) పలకరించి వారిని భవిత సెంటర్లకు పంపించాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో నాగపద్మజా, జిల్లా సంక్షేమ అధికారి నాగమణి, పర్వతగిరి తహసిల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్, పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News