Homeవరంగల్‌Arrangements | వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…

Arrangements | వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…

వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై(Arrangements) మండల స్థాయి అధికారులతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి ప్రవీణ్ కుమార్(V Praveen Kumar) అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిమజ్జన ప్రదేశాల గుర్తింపు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, బారికేడింగ్, వైద్య మరియు అత్యవసర సేవలు, అలాగే నిమజ్జనం అనంతరం వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై సమీక్షించి, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వేణుగోపాల్, మండల పంచాయతీ అధికారి బొగ్గ నారాయణ, ఏఎస్ఐ బి. పురుషోత్తం, ట్రాన్స్కో సిబ్బంది ఫరీద్, మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News