Homeమెదక్‌Councilor Umarani | ప్రజా సంక్షేమమే పరమావధి.. విద్యాభివృద్ధే నా ప్రథమ కర్తవ్యం

Councilor Umarani | ప్రజా సంక్షేమమే పరమావధి.. విద్యాభివృద్ధే నా ప్రథమ కర్తవ్యం

  • 4వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి నాగరాజు స్పష్టీకరణ
  • గర్ల్స్ హైస్కూల్‌లో కౌన్సిలర్ మెరుపు తనిఖీ.. స్వయంగా అల్పాహారాన్ని రుచి చూసి నాణ్యత పరిశీలన
  • సమస్యలపై స్పాట్ రియాక్షన్.. పరిసరాల పరిశుభ్రతపై అధికారులకు కౌన్సిలర్ అల్టిమేటం

వార్డు సమగ్ర పురోగతి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తానని, పాఠశాలల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి నాగరాజు (Councilor Umarani) మరోసారి తన సేవాతత్పరతను చాటుకున్నారు. గురువారం సదాశివపేట పట్టణంలోని 14వ వార్డు గర్ల్స్ హైస్కూల్‌ను ఆమె ఆకస్మికంగా సందర్శించి, విద్యాబోధన, మౌలిక వసతులపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు.

Umarani Nagaraju Inspects Sadashivapet Girls High School2

​బాధ్యతాయుత నాయకత్వం – అల్పాహార నాణ్యత స్వయంగా పరిశీలన:

​విద్యార్థినులకు అందుతున్న ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన కౌన్సిలర్ ఉమారాణి నాగరాజు, పాఠశాలలో అందిస్తున్న అల్పాహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యత, శుభ్రతను నిశితంగా పరిశీలించారు. “విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తే మనకు ముఖ్యం.. ఏ ఒక్క విద్యార్థికీ నాణ్యత లేని ఆహారం అందకూడదు” అని స్పష్టం చేస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

​సమస్యలపై కౌన్సిలర్ మెరుపు స్పందన:

​పాఠశాల ఆవరణను స్వయంగా పరిశీలించిన కౌన్సిలర్ దృష్టికి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రమైన సమస్యలను తీసుకొచ్చారు. పాఠశాల ప్రహరీ పక్కనే స్థానికులు, దుకాణదారులు చెత్తాచెదారం వేస్తున్నారని, బండరాళ్లు, వ్యర్థాలు పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లడమే కాకుండా విద్యార్థుల రాకపోకలకు ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి నాగరాజు క్షణాల్లో స్పందించి, తక్షణమే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడారు.పేరుకుపోయిన వ్యర్థాలు, బండరాళ్లను వెంటనే తొలగించి, ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని గట్టి ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల సమీపంలో చెత్త వేయకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

​అండగా ఉంటానంటూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భరోసా:

​పాఠశాలలో రక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, బాలికల ప్రత్యేక మరుగుదొడ్లు, ప్రాంగణ భద్రత వంటి కీలక అంశాలపై ఉపాధ్యాయులతో సమగ్రంగా సమీక్షించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించేందుకు తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కౌన్సిలర్ ఉమారాణి నాగరాజు భరోసా ఇచ్చారు.

సమస్యలను నేరుగా తన దృష్టికి తెచ్చినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆమె ధన్యవాదాలు తెలియజేయగా, తమ సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి పూనుకున్న ప్రజా పక్షపాతి కౌన్సిలర్ గారికి పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయసుధ, ఉపాధ్యాయులు, వార్డు నాయకులు పాండురంగారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News