Homeఆదాబ్ ప్రత్యేకంJawahar Nagar | మహిళా వసతి గృహం స్థలంపై కన్నేసిన అక్రమార్కులు..

Jawahar Nagar | మహిళా వసతి గృహం స్థలంపై కన్నేసిన అక్రమార్కులు..

  • జవహర్ నగర్ లో మహిళా వసతి గృహానిర్మాణానికి శంకుస్థాపన..
  • దీనికి సంబంధించిన స్థలం ఎవరిది అన్నది ప్రశ్నార్ధకంగా మారిన వైనం.. !
  • రూ. 100 కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరు..?
  • కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కాజేయాలని ప్లాన్ చేస్తున్న ఓ నాయకుడు..!
  • రాష్ట్రస్థాయి నాయకుల కనుసన్నలలో సర్వే నెంబర్ 647 భూ వివాదం..

మహిళా సాధికారతే మాధ్యేయం.. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా ఎజెండా అంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వంలో ఇప్పుడు ప్రతిష్టాత్కంగా శంకుస్థాపన జరిగిన ఓ మహిళా వసతి గృహం నిర్మాణం డైలమాలో పడిపోయింది.. శంకుస్థాపన జరిగిన స్థలం వివాదాల్లో కూరుకుపోయింది.. అసలు ఎవరు ఏమి చేస్తున్నారు..? ప్రభుత్వం ఎలా పోతోంది..? ఒక భూమి విషయంలో ఇంత గందరగోళం చోటుచేసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..

Jawahar Nagar Womens Hostel Land Controversy2

మేడ్చల్ జిల్లా, కీసర మున్సిపల్ సర్కిల్ పరిధిలోని జావహర్ నగర్ లో 500 పడకలతో ఒక మహిళా వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.. కానీ ఈ నిర్మాణ పనులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1988 నుంచి ఆస్థలంలోనే స్థానం ఏర్పరచుకున్న సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి ఆ స్థలం అతనిదే అంటూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్, కాప్రా తహసీల్దార్.. అదే భూమి నేడు తిరిగి మహిళా వసతి గృహానికి కేటాయించడంతో పాటు 20 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు.. ఇదిలా ఉంటే మరో వ్యక్తి ఆ భూమితో ఎవరికీ సంబంధం లేదు నాదే అంటూ.. బడాబడా నేతలతో కలిసి సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది..

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతుండటంతో స్థానికంగా ఉండే నేతలు అంతా కోట్ల రూపాయలు కూడబెట్టేందుకు ప్రభుత్వ స్థలాలను పట్టా భూములుగా నమ్మించి అమ్మేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా జవహర్ నగర్ సర్వేనెంబర్ 647లో 1.20 గుంటల స్థలం మహిళా వసతి గృహానికి కేటాయించిన స్థలాన్ని చెప్పుకోవచ్చు.. ఇప్పుడు అదే స్థలంలో కొంతమంది లేఔట్ వేసి దాదాపు 80శాతం ప్లాట్లు అమ్మినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొన్న వాళ్ళంతా ఎదురు తిరగకముందే జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు ఆపాలంటూ.. లే అవుట్ చేసిన వాళ్ళు రాష్ట్రస్థాయి నాయకుల చుట్టూ చెక్కర్లు కొడుతున్నారని ఆరోపిస్తున్నారు జవహర్ నగర్ స్థానిక నాయకులు..

Jawahar Nagar Womens Hostel Land Controversy1

సర్వే నెంబర్ 647లో 2004లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుండి ప్రొసిడింగ్ కాపీ పొందిన సుదర్శన్ రెడ్డి :

జవహర్ నగర్ సర్వేనెంబర్ 647లో ఉన్న సుమారు ఐదు ఎకరాల స్థలం 1988 నుండి నేనే సాగు చేసుకుంటూ వచ్చాను.. అనంతరం ఆ స్థలంలో మామిడి తోట ఏర్పాటు చేశాను.. నాకు హౌస్ టాక్స్ తో పాటు, విద్యుత్ శాఖ కేటాయించిన కరెంట్ బిల్ కూడా ఉన్నదని ఆధారాలతో చూపిస్తున్నాను.. కొంతమంది స్థానికంగా ఉండే నేతలు తమకున్న పలుకుబడి వినియోగించి, రౌడీలను పెట్టి నన్ను నా స్థలంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని మీడియాకు వెల్లడించారు..

ఒకవైపు సర్కార్ అభివృద్ధి దిశగా సాగేందుకు కోట్ల రూపాయల నిధులు కేటాయించి మహిళా వసతి గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టగానే కొందరు ఆగంతకులు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.. స్థలం నాదే అంటూ మీడియాను ఆశ్రయించాడు బాధితుడు.. కబ్జా చేసిన స్థలంలో అక్రమార్కులు యథేచ్ఛగా అక్రమానిర్మాణాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. కాగా, కాప్రా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ కనుసన్నలలోనే జవహర్ నగర్ లో ఉన్న ప్రభుత్వ స్థలాలలో విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి..

Jawahar Nagar Womens Hostel Land Controversy

స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడ..?

గతంలో మహిళ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్రమ నిర్మాణాలకు అడ్డుగా ఉన్నారంటూ బదిలీ చేయించిన మల్లారెడ్డికి నేడు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలలో లెక్కలేనన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కనిపించడం లేదా..? బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా..? అనేది ఒక ప్రశ్నలాగే మిగిలిపోయింది.. అయితే అందిన కాడికి దోచుకునే కొందరు కోట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు, సంపాదించుకొనే అవినీతి లీడర్లకు జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు కలిసొస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News