Homeరంగారెడ్డిJawahar Nagar | జవహర్‌నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

Jawahar Nagar | జవహర్‌నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో రూ.22 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కొటేషగౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందిని సూచించారు.

- Advertisement -

కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానందు, జవహర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు మాట్ల వినయ్, నాయకులు భాస్కర్, గాజ్వేల్ శంకర్, వెంకటేశ్వర్లు, మాట్ల శ్రీను, రఫిక్, శ్రీమాన్, రమేశ్‌చారి, వీరభాస్కర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News