- పెద్ద అంబర్పేట్, 252 డివిజన్, లక్ష్మారెడ్డిపాలెం
యుటిఎఫ్ డీ హిల్స్ కాలనీలో లయన్స్ క్లబ్ వనస్థలిపురం వారి సహకారంతో యుటిఎఫ్ డీ హిల్స్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన, ఉచిత వైద్య, రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు.(Free Medical Camp)
ఈ శిబిరంలో యుటిఎఫ్ డీ హిల్స్ కాలనీతో పాటు సమీపంలోని ఐదు కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దీప్య వెల్ బేబీ సెంటర్ మరియు ఎస్ వి డయాగ్నస్టిక్ చింతలకుంట వారు పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, Pulmonology సేవలను అందించారు. వీరితోపాటు ఆర్తో, గైనిక్, గుండె మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కాలనీ ప్రజలు కాలనీ కమిటీ సభ్యులకు, లయన్స్ క్లబ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ 320H డిస్ట్రిక్ట్ గవర్నర్ అశోక్ కుమార్ స్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని, అర్హత ఉన్న వ్యక్తులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని సూచించారు.
అలాగే ప్రజలకు ఆహారపు అలవాట్లు, ఆరోగ్య నియమాలు, క్రమబద్ధమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. రక్తదానం ద్వారా అవసరమైన సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నుండి రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాంప్రసాద్, చంద్రమౌళి నరసింహారెడ్డి మరియు ఇతర సభ్యులు కాలనీ కమిటీ ప్రతినిధులు మోహన్ రెడ్డి,అశోక్, రామ్ రెడ్డి ,రమేష్ గౌడ్, ఆనంద్ రెడ్డి ,శంకర్ గౌడ్ ,శ్రీరాములు, నరేందర్, చలపతి మరియు ఇతర వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
