- మద్దుల శ్రీనివాస్ రెడ్డి
- గుండ్లపోచంపల్లి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు..
మేడ్చల్: అహింస మార్గం ద్వారా స్వాతంత్య్రం సాధించడంలో ప్రపంచానికి స్పూర్తిదాతగా మహాత్మా గాంధీ నిలిచారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం సైబరాబాద్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధి గుండ్లపోచంపల్లి డివిజన్ లో మహాత్మ గాంది జయంతిని(Mahatma Gandhi Jayanti) మద్దుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండ్లపోచంపల్లి చౌరస్తాలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
అనంతరం మద్దుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి చేసిన పోరాటాన్ని ఆయన కొనియాడారు. గాంధీజీ ఆశయసాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేసి గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు జగన్ రెడ్డి, రాఘ జ్యోతి, గణేష్, మాజీ కౌన్సిలర్లు అమరం హేమంత్ రెడ్డి, అమరం జైపాల్ రెడ్డి, భేరి బాలరాజు, చింత పెంటయ్య, డివిజన్ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, నాయకులు జనార్దన్ రెడ్డి, మల్లారెడ్డి, సారా పద్మారావు, బండరి రాజు, నాగరాజు పటేల్, ప్రమోద్ వర్మ, గౌడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, బండారి శ్రీనివాస్, కుంచె శ్రీనివాస్, సత్తిరెడ్డి, విద్యాసాగర్, నర్సిగ్ రావు, యాదగిరి పటేల్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
