Homeరంగారెడ్డిArrest | 24 గంటల్లో ఆలయ దొంగ అరెస్ట్..!

Arrest | 24 గంటల్లో ఆలయ దొంగ అరెస్ట్..!

  • తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువుల చోరీ
  • రూ. 1.65 లక్షల విలువైన సొత్తు స్వాధీనం..
  • పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి

ఆమనగల్లు: దేవాలయాలను టార్గెట్‌ చేసి తాళాలు పగులగొట్టి బంగారం,వెండి,ఇత్తడి,రాగి వస్తువులను చోరీ చేస్తున్న నిందితుడిని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ఆమనగల్లు పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్(Arrest) చేశారు. సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీమ్,ఫింగర్‌ప్రింట్ విభాగం సహకారంతో కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి మొత్తం రూ. 1.65 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

రెండు ఆలయాల్లో చోరీ

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠాయిపల్లి గ్రామ శివారులో పెంట తండా గేట్ సమీపంలోని హనుమాన్ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న సభావత్ లక్ష్మణ స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 29న రాత్రి ఆలయానికి తాళం వేసి వెళ్లిన పూజారి మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.ఆలయంలోని బంగారు పూత వస్తువు, రాగి చెంబు, రాగి సరువు, ఇత్తడి గంటను దొంగలు అపహరించారు. పక్కనే ఉన్న పెద్దమ్మ దేవాలయంలోనూ తాళాలు పగులగొట్టి రెండు రాగి బిందెలు,గంటను చోరీ చేశారు.

- Advertisement -

సాంకేతిక ఆధారాలతో పట్టివేత

కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆమనగల్లు పోలీసులు అక్టోబర్ 1న క్లూస్ టీమ్,ఫింగర్‌ప్రింట్ విభాగం సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. దర్యాప్తులో నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంటరావుపల్లి గ్రామానికి చెందిన పెద్దముక్కల ఈశ్వర్ (38)ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు.విచారణలో విఠాయిపల్లి గ్రామ పరిధిలోని హనుమాన్,పెద్దమ్మ ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

పలు జిల్లాల్లో ఆలయాలే టార్గెట్?

అదేవిధంగా పెద్దకొత్తపల్లి,పానగల్లు,గంటరావుపల్లి,కందుకూరు ప్రాంతాల్లోని దేవాలయాల్లోనూ వెండి,ఇత్తడి వస్తువులను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్లలో గతంలో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

రూ.1.65 లక్షల సొత్తు స్వాధీనం

నిందితుడి నుంచి వెండి మీసాలు, వెండి నోరు,వెండి కండ్లు,రెండు ఇత్తడి దీపాలు,ఆరు ఇత్తడి గంటలు, రెండు ఇత్తడి మంగళ హారతులు, ఇత్తడి శఠగోపం, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కడ్తాల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు

అలాగే కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన బంగారు పూత వస్తువు,రాగి చెంబు,రాగి సరువు,ఇత్తడి గంట,రెండు రాగి బిందెలను కూడా స్వాధీనం చేసుకున్నారు.మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.1,65,000గా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్(Arrest) చేసి న్యాయపరమైన చర్యల నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. వారికి తగిన రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.

అధికారుల పర్యవేక్షణలో కేసు ఛేదన

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో,మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి(ఐపీఎస్),ఏసీపీ ఎస్.జానకి రెడ్డి మార్గదర్శకత్వంలో ఆమనగల్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఏఎస్ఐ రామ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్,కానిస్టేబుళ్లు శివకుమార్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News